Monday, January 6, 2025

షూటింగ్‌లో చేజారిన కాంస్యం

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్ షూటింగ్‌లో నాలుగో పతకాన్ని సాధించే అ వకాశాన్ని భారత్ తృటిలో చేజార్చుకుంది. సోమవారం జరిగిన స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో భారత్ ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలై పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది. భారత షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంత్‌జిత్ సింగ్ ద్వయం హోరాహోరీ పోరులో పరాజయం చవిచూసింది. చైనాకు చెందిన జియాంగ్, జియాన్లిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జంట 4344 తేడాతో పోరాడి ఓడించింది. ఇరు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. దీంతో మ్యాచ్ చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగింది. అయితే ఫలితం మాత్రం చైనా జోడీకి అనుకూలంగా వచ్చింది. దీంతో భారత జోడీ పతకం గెలిచే అవకాశాన్ని చేజార్చుకోక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News