Thursday, January 23, 2025

రహస్యంగా వివాహం చేసుకున్న ప్రముఖ నటి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటి మహిగిల్, వ్యాపారవేత్త, నటుడు రవికేషర్ ను రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. అయితే పెళ్లికి సంబంధిచిన ఫొటోలు, వీడియోలను మాత్రం ఆమె బయటపెట్టలేదు. వీరిద్దరూ 2019 వెబ్ సిరీస్ ఫిక్సర్‌లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. ఇంత కాలం తను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిపారు. మహీ గిల్ ప్రస్తుతం రవికేసర్, ఆమె కుమార్తె వెరోనికాతో కలిసి గోవాలో నివసిస్తున్నారు. ఆమె బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దబాంగ్ తో పాటు దాదాపు 40 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో మంచి పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మహిగిల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News