Monday, December 23, 2024

రాష్ట్ర మహిళా కమిషన్‌తో మహిళలకు భరోసా

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగం కల్పించిన హక్కులను మహిళలు సద్వినియో గం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మ న్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో మహిళా వికాస్ సంఘ్ సంస్థ ఏర్పాటు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాభాలో మహిళలు సగం శాతం ఉన్నారని, తమ హక్కులను సైతం ఉపయోగించుకోవాలన్నారు. నేడు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని, రానున్న రోజుల్లో మరింతగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. వంటింటికి పరిమితమైనమహిళలు నేడుఅన్ని అవకాశాలను అం దిపుచ్చుకుని ముందుకెళ్లడం అభినందనీయమని అన్నారు. మహిళలు సమస్య వస్తే చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని, కానీ సమ స్య వస్తే పరిష్కరించేందుకు కమిషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

గర్భస్థ శిశువు మొదలుకుని మరణించేంతవరకు మహిళల సంరక్షణకు అనేక చట్టాలున్నాయని గుర్తు చేశారు. మహిళలు ముందుకు వచ్చి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, ఇ టువంటి సంఘాలకు మహిళా కమీషన్ తరపు న తగిన సహకారం అందించేలా చూస్తామన్నా రు.మహిళలుకోరిన మేరకు కంటోన్మెంట్ ప్రాం తంలో సఖి సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చిన తక్షణమే కమిషన్ దృష్టికి తీసుకురావాలని ,మీకు సత్వర న్యాయం అందేలా చూ స్తుందని అన్నారు. మీకు ఏ సమస్య వచ్చి నా100,181 లేదా హెల్ప్ లైన్ 9490555533 ఫోన్ చేయవచ్చని మీకు అన్నివిధాల మహిళా కమిషన్ అం డగా ఉంటుందన్నారు.బిఆర్‌ఎస్ కంటోన్మెం ట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బేగంపేట ఠాణా సీఐ శ్రీ నివాస్ రావు, మహిళా వికాస్ సంఘ్ ప్రతినిధు లు మంజుల, శైలజ, భాగ్య, రేఖ, సుజన, త్రిష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News