Friday, November 22, 2024

నారీజన నీరాజనం

- Advertisement -
- Advertisement -

Mahilabandhu KCR celebrations across Telangana

మార్మోగిన ‘మహిళా బంధు కెసిఆర్’ నినాదం

మూడు రోజుల మహిళా దినోత్సవాల్లో
భాగంగా తొలి ముఖ్యమంత్రి
చిత్రపటాలకు రాఖీ పలు రీతుల్లో
సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆడపడుచుల
సంబురాలు మా సారథి మీరు అంటూ
సిద్దిపేటలో కెసిఆర్ ఆకారంలో చీరలపై అక్షర
చిత్రాలు కెసిఆర్ కిట్, కల్యాణలక్ష్మి,
షాదీముబారక్, షి టీమ్స్, సఖీ సెంటర్లు వంటి
పథకాలతో మహిళలకు భరోసా ఇస్తున్నందుకు
థాంక్స్ చెబుతూ పలు కార్యక్రమాలు

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను పురస్కరించుకుని టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు మహిళా బంధు పేరుతో ఆదివారం భారీ సంబురాల్లో మునిగితేలారు. మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కా ర్యక్రమాల్లో భాగంగా తొలిరోజు సిఎం కెసిఆర్ చిత్ర పటాలకు మహిళా నేతలు రాఖీలు కట్టి, క్షీరాభిషేకాలు, గాజులతో కెసిఆర్ చిత్ర రాజాలను అలంకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మా సారధి మీరు.. మా ఆడపడుచుల ఆత్మబంధువు మీరంటూ.. సిద్దిపేట మహి ళలు తన చైతన్యాన్ని చాటారు. మహిళలకు కెసిఆర్ చేస్తున్న సంక్షేమం, సిద్దిపేటలో మహిళల కోసం మంత్రి హరీశ్ రావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చీరలపైవేసి కెసిఆర్ అనే ఆకారంలో చీరలు పట్టుకొని..’ థ్యాంక్స్ టు కెసిఆర్.. థ్యాంక్స్ టు హరీశ్ రావు’ అంటూ నినాదాలతో మహిళలు మానవహారం నిర్వహించారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుకు సంక్షేమ సారె..- అంటూ చీరలతో ప్రదర్శించారు. రాష్ట్రంలో మహిళల కోసం సంక్షేమ పథకాలైన కెసిఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, షి టీమ్స్, సఖి సెంటర్లు, మహిళా పోలీసు స్టేషన్, భరోసా సెంటర్, మహిళా ప్రాంగణం, మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఇలా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడాన్ని మహిళలు కీర్తించారు.

కాగా బాన్స్‌వాడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొని కెసిఆర్ ప్రజా సంక్షేమ పాలనను స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా సంక్షేమం కోసం అమలవుతోన్న పథకాలతో కెసిఆర్ ఆడబిడ్డల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సిఎం తన పాలనలో మహిళలకు కొండంత అండ దొరికిందని కొనియాడారు. హైదరాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కృష్ణకాంత్ పార్కు వద్ద సుమారు 1000 మంది మహిళా పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, స్వయం సహాయాక సంఘాల ప్రతినిధులను సన్మానించారు. వరంగల్ జిల్లా హన్మకొండలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు మహిళా వారోత్సవాల్లో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు సిఎం పాటుపడుతున్న తీరును వారు కొనియాడారు. కాగా, మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు, కేసముద్రం మండలాల్లో మహిళలతో కలసి కెసిఆర్ చిత్రపటానికి ఎంపి మాలోతు కవిత, ఎంఎల్‌ఎ శంకర్ నాయక్ పాలాభిషేకం చేశారు.

మహిళలతో కలిసి ఎంపి కవిత సిఎం కటౌట్‌కు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎంపి, ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పక్షపాతిగా సిఎం కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఇదే సందర్భంలో పలువురు మహిళలను మంత్రి సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకే కల్యాణలక్ష్మిఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారన్నారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

కాగా, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో మహిళ బంధు సంబురాలు ఘనంగా జరిగాయి. ఖమ్మం పట్టణంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంపి నామా నాగేశ్వరరావు కలిసి మంత్రి పాల్గొన్నారు. కళాశాల మైదానంలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో లక్షా 116 గాజులతో కెసిఆర్ భారీ చిత్రాన్ని రూపొందించారు. దాని చుట్టూ మానవహారంగా మహిళలు నిలబడి కెసిఆర్ జయహో, థాంక్యూ కెసిఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మహిళల అభ్యున్నతికి కెసిఆర్ చేపడుతున్న పథకాలను టిఆర్‌ఎస్ నేతలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి, ఎంపి పంపిణీ చేశారు.

అనంతరం మహిళలతో కలిసి వారు సహపంక్తి భోజనం చేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా జనగామ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పారిశుధ్య కార్మికురాలికి పాదాభివందనంచేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చేర్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి పాదాభివందనం వారి సేవలను కొనియాడారు. సృష్టికి మూలం మహిళ అని వారిని అన్నిరంగాల్లో భాగస్వామ్యం చేస్తూ స్వశక్తిగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తూ ఆర్థిక అభివృద్ధితో పాటు స్వావలంబన పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News