Saturday, January 25, 2025

మహీంద్రా బోలెరో మాక్స్ పికప్ రేంజ్ లాంచ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : మహీంద్రా అండ్- మహీంద్రా (ఎం అండ్ ఎం) సరికొత్త బొలెరో మాఎక్స్ శ్రేణిని విడుదల చేసింది. బోలెరో పిక్ ట్రక్ రెండు సిరీస్‌లు హెచ్‌డి, సిటీ సిరీస్‌లలో లభ్యమవుతుంది. శక్తివంతమైన ఫ్లీట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీని కల్గివుంది. ఇది ఆరు భాషల్లో యాక్సెస్ చేయగల మొబైల్ యాప్‌లో 50కి పైగా ఫీచర్లతో వాహనం ట్రాకింగ్, రూట్ ప్లానింగ్, ఖర్చు నిర్వహణ, జియో-ఫెన్సింగ్, వాహనపు కండిషన్ పర్యవేక్షణ కోసం కీలకమైన మార్గదర్శకాలను అందిస్తుంది.

ఈ మోడల్ ప్రారంభ ధర రూ.7.85 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త బొలెరో మాఎక్స్ శ్రేణిని రూ.24,999 డౌన్ పేమెంట్‌తో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ, సరికొత్త బొలెరో మాఎక్స్ శ్రేణి అత్యాధునిక ఫీచర్లు, సాటిలేని శక్తి, గరిష్ట పేలోడ్ సామర్థ్యాలు ఇంకా అధిక మైలేజీని కూడా అందిస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News