Friday, December 20, 2024

కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌కు టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కెటిఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ గురువారం ప్రత్యేకంగా కలిశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన మహీంద్రా ఈ-రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శనలో కెటిఆర్, ఆనంద్ మహీంద్రాతో కలిసి రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను శుక్రవారం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సిఎండి సిపి గుర్నానితో సమావేశం అద్భుతంగా జరిగింది. ఫార్ములా ఈ -రేసింగ్‌లో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. హైదరాబాద్ నగరానికి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలను తీసుకువస్తున్నందుకు మంత్రి కెటిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News