- Advertisement -
న్యూఢిల్లీ : భారతదేశం ఆటో పరిశ్రమ మార్గదర్శకుడు, మహీంద్రా అండ్ మహీంద్రా గౌరవ చైర్మన్ కేశబ్ మహీంద్రా(99) బుధవారం ఉదయం కన్నుమూశారు. బుధవారం ఇంటి వద్ద కేశబ్ తుదిశ్వాస విడిచారని కంపెనీ ప్రకటించింది. కేశబ్ ఆదర్శప్రాయుడని, నైతిక విలువలు, ఉత్తమ కార్పొరేట్ పాలనలతో నెలకొల్పిన సంస్థ వారసత్వాన్ని కొనసాగించడం ముందుంటారని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. కేశబ్ దాదాపు 48 సంవత్సరాలు చైర్మన్‌గా మహీంద్రా గ్రూప్‌నకు నాయకత్వం వహించారు. ఐటి, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ వంటి ఇతర వ్యాపార రంగాలకు ఆయన ఆటోమొబైల్ తయారీ నుంచి సేవలను విస్తరించారు.
- Advertisement -