Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో మహీంద్రా లాజిస్టిక్స్ వేర్‌హౌస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్‌ఎల్) నూతన నెట్ జీరో సదుపాయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. బహుళ ఖాతాదారుల సామర్థ్యాలు, పునరుత్పాదక శక్తి, వనరుల పరిరక్షణ, గ్రీన్ కవర్ సహా పర్యావరణ అనుకూల వేర్‌హౌసింగ్ ఆర్కిటెక్చర్‌ను ఇది కలిగి ఉంది. ఈ అత్యాధునిక నెట్ జీరో మల్టీ క్లయింట్ వేర్‌హౌస్ సిద్ధిపేట జిల్లా ముల్గు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రీయల్ పార్క్ వద్ద ఉంది.

మహీంద్రా లాజిస్టిక్స్ ఎండి, సిఇఒ రామ్ ప్రవీణ్ స్వామినాథన్ మాట్లాడుతూ, సంస్థ వేర్‌హౌిసింగ్ వ్యాపారాలను వృద్ధి చేయాలనే ప్రయత్నంలో ఈ నూతన కేంద్రం ప్రారంభిస్తున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నామని అన్నారు. ఇది వినియోగదారుల తయారీ, ఫుల్‌ఫిల్‌మెంట్, అలాగే ఇ-కామర్స్ వినియోగదారులకు మద్దతునందించనుంది. ఈ నూతన కేంద్రం 100 శాతం సౌర, బ్యాటరీ స్టోర్డ్ శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందజేస్తుంది. ఎంఎల్‌ఎల్ 350 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తే, థర్డ్ పార్టీ అసోసియేట్లు అంతకు మూడింతల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే అవకాశాలున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News