Wednesday, January 22, 2025

ఈ కారుకు భలే డిమాండ్..కొనాలంటే 18 నెలలు ఆగాల్సిందే!

- Advertisement -
- Advertisement -

మహీంద్రా థార్ రాక్స్ ఈ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, థార్ రాక్స్ ప్రారంభించినప్పటి నుండి ఈ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ వస్తోంది.ఈ మహీంద్రా థార్ రాక్స్ బుకింగ్ అక్టోబర్ 3న ప్రారంభమైన వెంటనే..కేవలం 1 గంటలో 1 లక్ష 76 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. థార్ రాక్స్ బుకింగ్ పెరుగుతున్న కొద్దీ దాని వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో వెయిటింగ్ పీరియడ్ 18 నెలలకు చేరుకుందని ఇటీవల రాక్స్ ఆర్డర్ ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా ఇప్పుడు ఆర్డర్ చేయడంపై థార్ రాక్స్ డెలివరీ 2026 సంవత్సరం నాటికి ఉంటుందని భావిస్తున్నారు. థార్ రాక్స్‌కు డిమాండ్ పెరగడంతో వేచి ఉండే సమయం త్వరలో ఒకటి లేదా రెండు సంవత్సరాలకు చేరుకోవచ్చని దీని ద్వారా స్పష్ఠంగా అర్థం అవుతోంది.

ఇంజిన్

మహీంద్రా థార్ రాక్స్ ఒక ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కారు. ఈ వాహనం పెట్రోల్ వేరియంట్ 2-వీల్ డ్రైవ్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీలో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 162 hp పవర్, 330 Nm టార్క్ లభిస్తుంది. అయితే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌పై 177 హెచ్‌పి పవర్, 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అవుతుంది.

మహీంద్రా థార్ రాక్స్ 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికను కూడా కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ 152 hp శక్తిని, 330 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఇది 4 WD ఎంపిక డీజిల్ ఇంజన్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది.

 

ధర

మహీంద్రా థార్ రాక్స్ ఏడు కలర్ వేరియంట్లలో మార్కెట్లోకి రానున్నది. ఈ కారులో 26.03-సెంటీమీటర్ ట్విన్ డిజిటల్ స్క్రీన్ ఉంది. వాహనంలో పనోరమిక్ స్కైరూఫ్ కూడా అందించారు. ఈ మహీంద్రా ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.99 లక్షల నుండి మొదలై రూ. 22.49 లక్షల వరకు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News