Thursday, March 13, 2025

నమ్మివచ్చినందుకు ఢిల్లీలో బ్రిటన్ యువతిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని నమ్మి భారత్‌కు వచ్చిన బ్రిటన్ యువతిపై అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసే కైలాశ్‌కు బ్రిటన్‌కు చెందిన ఓయువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. దీంతో అతడిని కలిసేందుకు ఆమె భారత్‌కు వచ్చింది. ఆమె తొలుత గోవా, మహారాష్ట్రలలో పర్యటించింది. కైలాశ్‌ను రమ్మని కబురు పంపడంతో తానే రాలేనని ఢిల్లీకి రావాలని కోరాడు. దీంతో ఆమె అతడు చెప్పినట్టుగా ఢిల్లీలోని మహిపాల్ పూర్ ప్రాంతంలోని ఓ హోటల్‌కు వెళ్లింది. ఓ హోటల్ రూమ్‌లో బ్రిటన్ యువతిపై కైలాశ్ అత్యాచారం చేశాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కర్నాటక రాష్ట్రం కొప్పళ జిల్లాలో పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ పర్యాటకులపై దాడి చేసి అనంతరం ముగ్గురిని కాలువలోకి తోసేశారు. ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News