భారత క్రికెటర్లు, హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు రావడం కొత్తేమీ కాదు. ఒకటి రెండు సార్లు కలిసి కనిపిస్తే చాలు వాళ్లకు లింక్ అంటగట్టేస్తారు. తాజాగా ఇలాంటి పరిస్థితే.. టీం ఇండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఎదురైంది. సిరాజ్, హిందీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ మహిరా శర్మతో డేటింగ్ చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. అయితే మహిరా పోస్టుకు సిరాజ్ లైక్ చేయడం.. తనని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.
అయితే తాజాగా ఈ పుకార్లకు మహిరా శర్మ క్లారిరీ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేనని ఆమె పేర్కొన్నారు. అభిమానులు ఎవరితో అయినా సంబంధాలు పెట్టగలరు అని.. తాను నటించిన వారితో సంబంధాలు పెట్టగలరుని ఆమె అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని ఆమె స్పష్టం చేశారు. అయితే మహిరా తల్లి సానియా కూడా స్పందించారు. తన కుమార్తె సెలబ్రిటీ అవ్వడం వల్ల ఇలాంటి పుకార్లు వస్తాయని వాటిని ఎవరూ నమ్మవద్దని ఆమె తెలిపారు.