Sunday, January 19, 2025

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్.. సిరాజ్‌కు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ యువ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన సిరాజ్ ఐసిసి బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోతున్న సిరాజ్ వన్డేల్లో ఏకంగా మొదటి ర్యాంక్‌ను అందుకుని పెను ప్రకంపనలు సృష్టించాడు.

ప్రస్తుతం సిరాజ్ 729 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. బ్యాటింగ్ విభాగంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. భారత యువ సంచలనం శుభ్‌మన్ గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లి ఏడో, రోహిత్ తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News