Friday, January 24, 2025

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు: మహమూద్ ఆలీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో శనివారం జరిగిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఘటనపై హోంమంత్రి స్పందిస్తూ మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతున్నారన్నారు. ఈక్రమంలో ఈ సంఘటన జరగడం బాధాకరమని, నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారని వివరించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఎవరినీ వదలని, నిందితులు ఎవరైనా చర్యలు తప్పవన్నారు. మా కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని హోంమంత్రి పేర్కొన్నారు.

Mahmud Ali respond on Jubilee Hills Rape Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News