Wednesday, January 22, 2025

వ్యాపారికి లోక్‌సభ వెబ్‌సైట్ లాగిన్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మెయిత్రాపై బిజెపి ఎంపి నిశికాంత్ దూబే తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. లోక్‌సభ వెబ్‌సైట్ సమాచారం పొందేందుకు టిఎంసి ఎంపి ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనికి లాగిన్ వీలు కల్పించిందని పేర్కొంటూ నిశికాంత్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సంబంధిత విషయంపై కేంద్ర ఐటి మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు , సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు లేఖలు రాశారు. బిజినెస్‌మెన్ వ్యాపార ప్రయోజనాలకు వాడుకునేందుక టిఎంసి ఎంపి లంచాలు తీసుకుని లోక్‌సభ వెబ్‌సైట్‌ను లీక్ చేసిందని ఈ లేఖలలో ఆరోపించారు. ఈ మహిళా ఎంపిపై ఇప్పటికే ప్రశ్నలకు ముడుపుల ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఈ వెబ్‌సైట్ లాగిన్ విషయం కూడా ప్రస్తావిస్తున్నానని తెలిపిన

బిజెపి ఎంపి వీటిన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాల్సి ఉందని ఐటి మంత్రిత్వశాఖకు లేఖలో తెలిపారు. సంబంధిత విషయంలో తనకు సుప్రీంకోర్టు లాయరు ఒకరి ద్వారా పూర్తి సాక్షాధారాల సమాచారం అందిందని బిజెపి ఎంపీ వెల్లడించారు. ఇప్పటి వ్యవహారం 2005 నాటి క్యాష్ ఫర్ క్వెరీ స్కాండల్‌ను తలపించిందని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు లోక్‌సభ స్పీకర్ ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కూడా బిజెపి ఎంపి డిమాండ్ చేశారు. ఐటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని దర్యాప్తు జరిపితే పార్లమెంట్ సభ్యురాలి ద్వారా లోక్‌సభ వెబ్‌సైట్ ఇతరులకు లాగిన్ అయిందీ లేనిదీ తెలిసిపోతుందని, దీని ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉందని నిశికాంత్ దూబే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News