- Advertisement -
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను , వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో గతంలో కూడా ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా ఉల్లంఘన కేసులో ఇంతకు ముందు రెండుసార్లు ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19, మార్చి 11తేదీల్లో ఈడీ విచారణకు ఆమె గైర్హాజరయ్యారు. కేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో విచారణకు హాజరు కావాలని ఈడీ తమ సమన్లలో కోరింది. క్యాష్ అండ్ క్యారీ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవల ఆమె నివాసాలపై దాడులు జరిపిన నేపథ్యంలో ఈడీ మూడోసారి ఆమెకు తాజా సమన్లు జారీ చేసింది.
- Advertisement -