Saturday, December 21, 2024

31న విచారణకు రాలేను ఎథిక్స్ కమిటీకి మొయిత్రా లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా తాను ఈ నెల 31 విచారణకు హాజరు కాలేనని పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. కమిటీ విచారణకు హాజరయేందుకు తనకు మర్కింత సమయం కావాలని కోరారు. ఈ మేరకు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి రాసిన లేఖను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నవంబర్ 5 తర్వాత మీరు ఎంపిక చేసే ఏ తేదీనైనా హాజరు కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకార్‌కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న దుర్గా ఉత్సవాల కారణంగా తాను నవంబర్ 4 వరకు బిజీగా ఉంటానని, అందువల్ల విచారణకు రాలేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో బిజెపి ఎంపి రమేశ్ బిధూరి విజ్ఞప్తి మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ తేదీని మార్పు చేసిన విషయాన్ని ఆమె తన లేఖలో ప్రస్తావించారు. అలాగే వ్యాపారవేత్త హీరా నందానీని కూడా కమిటీ విచారణకు పిలవాలని, ఆయననుంచి తాను స్వీకరించినట్లుగా చెబుతున్న బహుమతుల వివరాలను కమిటీకి సమర్పించాలని మొయిత్రా తన లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News