మంగళవాం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పిన్ సంచలనం చాహల్ రెచ్చిపోయాడు. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి. పంజాబ్ విజయానికి బాటలు వేశాడు. అయితే చాహల్ ఆటతీరుపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. చాహల్ కొత్త గర్ల్‌ప్రెండ్ అని ప్రచారంలో ఉణ్న మహ్‌వశ్ కూడా చాహల్‌ని ప్రశంసిస్తూ.. సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘చాహల్ నీ టాలెంట్ మామూలుగా లేదు. కాబట్టే నువ్వు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌వి’ అంటూ పోస్ట్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు.. మరోసారి చాహల్, మహ్‌వశ్ ప్రేమ కథను తెరమీదకు తీసుకువచ్చారు. ‘ఇద్దరు లవ్‌లో ఉన్నారు కాదా..?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను మహ్‌వశ్ చాహల్‌తో కలిసి చూసింది. అప్పుడు కూడా ఇదే విధంగా వీరిద్దరు మధ్య ప్రేమ ఉందని పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ, ఇద్దరు వాటిని ఖండించారు. ఛాహల్ ఇటీవలే తన భార్య ధనశ్రీ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా, నిన్నటి మ్యాచ్2లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కోల్‌కతా విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, పంజాబ్ బౌలర్ల మ్యాజిక్ బౌలింగ్‌తో కోల్‌కతాను 95 పరుగులకే ఆలౌట్ చేసి.. మ్యాచ్‌లో విజయం సాధించారు.