- Advertisement -
మైలార్ దేవ్ పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ఎటిఎం దొంగలు రెచ్చిపోయారు. మధుబన్ కాలనీ వద్ద ఎస్ బిఐ ఎటిఎం లోకి ముఠా సభ్యులు చోరబడ్డారు. ఎటిఎం పగళగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎటిఎం డోర్లు ఎంతకీ తెరుచుకోకపొవడం దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. నిమిషాలలో వ్యవధిలోనే ఎటిఎంలోని 7 లక్షల కరెన్సీ నోట్లు బూడిదగా మారాయి. బ్యాంకు సిబ్బంది సమాచారం మేరకు మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఠా సభ్యులు ఎస్ బిఐ ఎటిఎంలను టార్గెట్ చేశారు. జనావాసాలు తిరగని ప్రాంతాలలో చోరీకి స్కెచ్ వేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి టివి ఫూటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
- Advertisement -