Saturday, September 14, 2024

మైనర్ బాలికపై అత్యాచారం: ప్రధాన నిందితుడు మృతి

- Advertisement -
- Advertisement -

గువాహటి: అస్సాంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిపినట్లుగా ఆరోపణ వచ్చిన ప్రధాన నిందితుడు నాగావ్ జిల్లా ధింగ్‌లో శనివారం పోలీస్ కస్టడీలో నుంచి తప్పించుకుని, ఒక చెరువులో దూకి మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుని స్వస్థలమైన బొర్భెటి గ్రామస్థులు అతని అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొనరాదని, గ్రామ శ్మశానవాటికలో అతనిని ఖననం చేయనివ్వరాదని నిర్ణయించారు. శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన నిందితుని శనివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు నేర సంఘటన పునఃసృష్టి కోసం ఆ ప్రదేశానికి బేడీలతో తీసుకువెళ్లినట్లు నాగావ్ ఎస్‌పి స్వప్నీల్ దెకా విలేకరులతో చెప్పారు.

‘నిందితుడు ఒక పోలీస్‌ను కొట్టి కస్టడీలో తప్పించుకుపోయి, చెరువులోకి దూకాడు’ అని దెకా తెలియజేశారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు వెంటనే సమాచారం ఇచ్చినట్లు, అన్వేషణ ప్రారంభించినట్లు, సుమారు రెండు గంటల తరువాత అతని మృతదేహాన్ని వెలికితీసినట్లు ఆయన తెలిపారు. పోలీసు కూడా గాయపడగా, అతనిని ఆసుపత్రిలో చేర్పించినట్లు ఎస్‌పి తెలిపారు, తక్కిన ఇద్దరు నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. వారి కోసం పలు ప్రదేశాల్లో దాడులతో గాలింపు సాగుతోంది. ఇది ఇలా ఉండగా, అత్యాచార సంఘటన పట్ల నిరసన సూచకంగా గ్రామ మసీదు నుంచి ఒక పాదయాత్ర కూడా చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News