Tuesday, January 21, 2025

ఇది బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పేపర్ లీకేజీ దొంగలు దొరికారని, వాళ్ల వెనకాలున్న అసలు దొంగలు కూడా దొరికారని టిఎస్ రెడ్కో ఛైర్మెన్ సతీష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇవ్వాళ పేపర్ లీక్‌లో ముఖ్య నిందితుడు బిజెపి కార్యకర్త అని, బండి సంజయ్ సన్నిహితుడు కూడానని సతీష్ రెడ్డి తెలిపారు. పేపర్ లీక్ అనంతరం బండి సంజయ్‌తో ఫోన్‌లో ఆ నిందితుడు టచ్‌లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. పేపర్ లీకేజీ వెనుకనున్న బిజేపి కుట్రను వెలికి తీయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News