- Advertisement -
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎంపి రేవంత్ రెడ్డిపై ఇడి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎసిబి ఛార్జ్‌షీట్ ఆధారంగా రేవంత్‌రెడ్డిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఎంఎల్‌ఎ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్ పట్టుబడ్డాడు. మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా స్టీఫెన్‌సన్‌తో రేవంత్ రాయబారం నడిపాడు. టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా కోరారు. ఎంఎల్‌ఎ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురి చేశారని ఎసిబి అభియోగం మోపింది. ఛార్జ్ షీట్‌లో ప్రధాన నిందితుడిగా ఎంపి రేవంత్ రెడ్డిని పేర్కొంది.
- Advertisement -