Thursday, January 16, 2025

గిరిజనుల ప్రధాన డిమాండ్లను పార్టీల మ్యానిఫెస్టోల్లో చేర్చాలి

- Advertisement -
- Advertisement -

గిరిజన సంఘాల చర్చావేదిక డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సమాఖ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో గిరిజన డిక్లరేషన్ ముసాయిదాపై జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న గిరిజన సంఘాలు, మేధావులు డిమాండ్ చేశాయి. తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మ నాయక్‌ల అధ్యక్షతన గిరిజన డిక్లరేషన్ ముసాయిదాపై జరిగిన చర్చావేదికలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ గిరిజన డిక్లరేషన్ ముసాయిదాను ప్రవేశపెట్టగా దీనిపై గిరిజన సంఘాలు, మేధావులు చర్చల్లో పాల్గొన్నారు.

ఇందులో గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ధనంజయ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్, ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రఘు, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ అధ్యక్షులు రవీందర్ నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు సుమన్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు అమర్ సింగ్, గిరిజన సమాఖ్య నాయకులు. రమావత్ దేవీలాల్, చత్రు ,నారాయణ, అంజయ్య గిరిజన సంఘం నాయకులు బాలునాయక్‌త దితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30 న జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటించబోతున్న తరుణంలో గిరిజనుల ప్రధాన డిమాండ్లను ఆయా పార్టీల మ్యానిఫెస్టోలో చేర్చాలని లేకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఓట్ల కోసం గిరిజనులకు మాయ మాటలు చెప్పి వారికి ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా గిరిజనులను మోసం చేస్తున్నాయని ఆరోపించాయి. అటువంటి మోసపూరిత వాగ్దానాలు చేయకుండా గిరిజన సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నదని గిరిజనులను విజ్ఞప్తి చేశారు.

గిరిజనులకు నేరుగా లబ్ధి జరిగే విధంగా అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం, సమానత్వంతో కూడిన ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో గిరిజనుల అభివృద్ధి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబిం చినా ఆ పార్టీకి మద్దతు ఇచ్చి రాష్ట్రంలో గిరిజనులకు ద్రోహం చేసిందని ఆరోపించారు. విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయా లని ఉన్న కేంద్రం నుండి కొట్లాడి త్వరగా సాధించడంలో కూడా కాలయాపన చేసిందన్నారు . రాష్ట్రంలోని గిరిజన సంఘాలు, మేధావులతో చర్చించి ఆమోదించిన గిరిజన డిక్లరేషన్ను అన్ని రాజకీయ పార్టీల అగ్ర నాయకులను కలిసి వారి మేనిఫెస్టోలో చేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావా లని తీర్మానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News