Thursday, January 23, 2025

ప్రధాన రహదారి.. పార్కింగ్ స్థలమా…!

- Advertisement -
- Advertisement -

సంగెం: మండల కేంద్రంలోని మీ సేవ దగ్గర మంగళవారం సర్టిఫికెట్ల కోసం వచ్చిన ప్రజల వాహనాలు సంగెం తీగరాజుపల్లి ప్రధాన రహదారిపై నిలపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. గృహలక్ష్మి పథకం కోసం కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోడానికి బారులు తీరారు. దీంతో వారి వాహనాలను ప్రధాన రహదారిపై పార్కింగ్ చేయ డంతో అటుగా వెళ్తున్న వాహనదారుల రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాలతో ఇబ్బందులు పడ్డారు. సంగెంతోపాటు మండలంలోనిమీ సేవా కేంద్రాల్లో  వచ్చిన వారి దగ్గర వద్ద నుంచి మీ సేవా నిర్వాహకులు ఎడా పెడా వసూళ్లు చేస్తున్నారు. ఒక్క సర్టిఫికెట్‌కు సర్వీస్ ఛార్జీతో కలిసి రూ. 50 వసూలు చేయాల్సి ఉండగా కులం నివాసం, ఆదాయం రెండు సర్టిఫికెట్ల కోసం సుమారు రూ. 200 నుంచి 220 వసూలు చేస్తున్నారని దరఖాస్తు దారులు ఆరోపిస్తున్నారు.

మీ సేవా కేంద్రాల్లో ధరల పట్టిక ఏర్పాటు చేయకపోవడంతో పాటు అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఇదే అదనుగా మీసేవా నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మీ సేవా కేం ద్రాలపై డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పటికీ అ ధికారులు చర్యలు చేపట్టకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటకు తయారైందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మీ సేవా కేంద్రాలపై పర్య వేక్షణ చేసి అధికంగా రుసుము వసూలు చేస్తున్న కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాల పేరుతో మీ సేవా కేంద్రాలు దోపిడీ చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News