Sunday, December 29, 2024

మైనంపల్లి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్‌ఎస్ శ్రేణులు

- Advertisement -
- Advertisement -

హరీష్‌రావుపై విమర్శలు చేస్తే సహించేది లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తన కుటుంబీకులని నిరంతరం ప్రజల గురించి ఆలోచించే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావుపై మల్కాజ్‌గిరి ఎంఎల్‌ఎ మైనంపల్లి హనుమంతరావు విమర్శలు చేయడం సరికాదని బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు సద్ది నాగరాజు రెడ్డి, కెమ్మసారం ప్రవీణ్ కుమార్, సాయన్నగారి సుందర్ లు మండిపడ్డారు. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలకు నిరసనగా సోమవారం గణేష్‌నగర్ లో మైనంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేసి మాట్లాడారు.

స్వంత పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. మెదక్ ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు మైనంపల్లి ఏం అభివృద్ధి చేశాడు? అని ప్రశ్నించారు. ‘ప్రజలను మోసం చేసే నైజం ఆయనది. ప్రజలు నిన్ను రాజకీయంగా బొంద పెడుతారు. దమ్ముంటే సిద్దిపేటకు వచ్చి చూడు, మేమెందో చూపిస్తాం. తెలంగాణ కోసం పదవులను కూడ పక్కన పెట్టిన చరిత్ర హరీష్ రావుది. కాంగ్రెస్, బిజెపి తో కుమ్మక్కు అయ్యి హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నాడు. మంత్రి హరీష్‌రావుకు రాజకీయంగా ప్రజల్లో వస్తున్న ఆధారణను చూసి ఓర్వలేకే విమర్శలకు పాల్పడ్డార’ని మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటి విమర్శలు చేస్తే సహించేది లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు పోశంగారి సత్తిరెడ్డి, బొంగు రాజేందర్ రెడ్డి, మాడూరి కిట్టు, లిఖిత్, వీరుగౌడ్,భాస్కర్, మల్లారెడ్డి, శ్రీనివాస్, అశోక్ తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News