Friday, January 10, 2025

ప్రాణం తీసిన పది రూపాయల పెట్రోల్

- Advertisement -
- Advertisement -

లక్నో: పెట్రోల్ పోయించుకున్న తరువాత పది రూపాయలు తక్కువ చెల్లించావని అడినందుకు షాప్ అతడిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మెయిన్‌పూరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహేష్ చంద్ జాతవ్ అనే దళిత వ్యక్తి కిరాణం షాప్‌ను రన్ చేస్తున్నాడు. అదే షాపులో అతడు పెట్రోల్ కూడా అమ్ముతున్నాడు.

Also Read: వైరల్ వీడియో: ధైర్యంలేని ప్రియుడి కంటే.. మనసున్న దొంగే బెటర్

కొన్ని రోజుల క్రితంలో గుల్‌ఫామ్ అలియాస్ గుళ్ల బంజారా అనే వ్యక్తి జాతవ్ షాపులో పెట్రోల్ తీసుకెళ్లాడు. పది రూపాయలు తక్కు వ ఇచ్చాడు. దీంతో పది రూపాయలు ఇవ్వాలని జాతవ్ గుల్‌ఫామ్‌ను అడిగాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో చంపేస్తానని గుల్‌ఫామ్‌ను జాతవ్ బెదిరించాడు. గుల్‌ఫామ్ పగతీర్చుకోవాలని నిర్ణయ తీసుకున్నాడు. జూన్ 12న జాతవ్‌ను గుల్‌ఫామ్ తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని జూన్ 27న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News