Thursday, November 14, 2024

శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

లింగాల : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించకుండా పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా పనిచేస్తుందని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పి మనోహర్ అన్నారు. మంగళవారం లింగాలలోని పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. రవాణా ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు మన బాధ్యత అని పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

శాంతియుత వాతావరణంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. నేరాలు, ఘోరాలు జరగకుండా అదుపు చేసేందుకు పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా సిసి కెమెరాలు ఉపయోగపడుతాయని అన్నారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు చేసిన వారిని త్వరగా గుర్తించుటకు దోహపడుతుందని వాటిని గ్రామాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని, పోలీసులు ప్రజలకు రక్షణ కవచంలా పని చేయడమే ప్రధాన ధ్యేయమని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలో శాంతియుత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపడుతూ పోలీస్ సిబ్బందిని సంసిద్ధులను చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి కృష్ణమోహన్, సిఐ అనుదీప్, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News