జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పహల్గామ్ సమీపంలోని మారుమూల బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇప్పటివరకు 26 మంది పర్యాటకులు చనిపోయారు. మరికొంతమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, జైపూర్, అమృత్‌సర్‌లతో పాటు మేజర్ సిటీల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో కీలకమైన పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాల వద్ద నిఘాను పోలీసులు పెంచారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కూడా నిఘాను పెంచారు. సున్నితమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించారు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ బృందాలను మోహరించారు. ఇక, భద్రతా తనిఖీలను వేగవంతం చేయాలని ముంబై పోలీసులను ఉన్నతాదికారులు ఆదేశించారు.