Monday, January 20, 2025

రూ.44 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాల పట్టివేత

- Advertisement -
- Advertisement -

కొచ్చిన్ : డీఆర్‌ఐ కొచ్చిన్ జోనల్ పరిధి లోని కాలికట్ రీజినల్ యూనిట్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను భగ్నం చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ముసాఫర్ నగర్‌కు చెందిన రాజీవ్‌కుమార్ నుండి రూ. 44 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం యుపీకి చెందిన రాజీవ్‌కుమార్ వద్ద నుండి 3.5 కిలోల కొకైన్‌ను, 1.3 కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ.44 కోట్లు ఉండవచ్చని తెలిపారు. నైరోబీ నుంచి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా విమానంలో కాలికట్ విమానాశ్రయానికి తీసుకొచ్చారని చెప్పారు. నిందితుడు బూట్లలోను, హ్యాండ్ బ్యాగుల్లోనూ, పర్సులోనూ చెకిన్ లగేజీ బ్యాగ్ లోనూ వీటిని అమర్చి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News