Saturday, December 28, 2024

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

 ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు
 తప్పిన ప్రాణనష్టం..
పూర్తిగా కాలిబూడిదైన పరిశ్రమ భవనం
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు పరిశ్రమ మొత్తం వ్యాపించి పరిశ్రమను అగ్నికి ఆహుతి చేశాయి. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు మంటలు అదుపులోకి రాకపోవడంతో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అలుపెరగకుండా శ్రమించిన మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా పరిశ్రమ యాజమాన్యానికి భారీ ఆస్తి నష్టం జరిగింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్‌ఎస్‌వి పరిశ్రమలో సంచుల తయారీ ప్రక్రియ నడుస్తుంది.

రోజులాగా మంగళవారం పనిచేస్తుండగా మధ్యాహ్న సమయంలో షార్ట్ సర్క్యూట్ వలన ఒక్కసారిగా మూడో అం తస్తులో మంటలు చెలరేగాయి. మొత్తం 3 అంతస్తుల భవనం చుట్టుముట్టడంతో భవనం పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. కింద అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి ఉపయోగించే ముడి సరుకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యా హ్నం నుండి రాత్రి వరకు ఎగిసిపడుతున్న మంటలకు భవనం ఒక వైపు కూలిపోయింది.

7 ఫైర్ ఇంజన్లు, 40 వాటర్ ట్యాంకర్లకు పైగా నీటిని ఉపయోగించిన అగ్ని అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. స్థానిక పారిశ్రామికవేత్తలు సైతం వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. హూ కావడంతో సహాయ క చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన తీవ్రంగా శశ్రమించిన ఫైర్, జిహెచ్‌ఎంసి, డిఆర్‌ఎఫ్ సిబ్బంది, నాలుగు పోలీస్ స్టేషన్ల కు సంబంధించిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఇటువంటి ఇ బ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. బాలానగర్ ఏసిపి హనుమంతరావు ఘటన స్థలాన్ని పరిశీలించి ముందస్తుగా నీటి సరఫరాకు ఆదేశించారు. దులపల్లి రోడ్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ ప్రత్యక్షంగా చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News