Monday, December 23, 2024

‘మేజర్’ సెన్సార్ పూర్తి

- Advertisement -
- Advertisement -

Major Movie Get U/A Certificate from Censor Board

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మేజర్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా మొత్తం నిడివి 149 నిమిషాలు. ‘మేజర్’ చిత్రం కంటెంట్, భావోద్వేగాలు సెన్సార్ బోర్డ్ సభ్యులని ఆకట్టుకున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో సందీప్ వ్యక్తిగత జీవితం, తల్లిదండ్రులతో వున్న అనుబంధం, ఇషాతో చిన్ననాటి ప్రేమని మైమరపించే విధంగా చూపించారు. సెకండ్ హాఫ్‌లో భారీ యాక్షన్, హై అండ్ ఎమోషనల్ మూమెంట్స్‌తో ప్రేక్షకులు చూపుతిప్పుకోలేనంత గొప్ప అనుభవాన్ని ఈ చిత్రం అందిస్తుంది. భారీ నిర్మాణ విలువలు, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన ‘మేజర్’ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. అడివి శేష్ తన అద్భుతమైన నటనతో కొన్ని సన్నివేషాల కోసం స్కూల్ డేస్‌లోకి కూడా చక్కగా ట్రాన్సఫర్మేషన్ కావడం అద్భుతం అనిపిస్తుంది. భారీ అంచనాలతో ఈ సినిమా జూన్ 3వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇదే సమయంలో ముందుగానే ‘మేజర్’ చిత్రం ప్రివ్యూలను దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తారు.

Major Movie Get U/A Certificate from Censor Board

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News