Monday, December 23, 2024

వేసవి కానుకగా ‘మేజర్’…

- Advertisement -
- Advertisement -

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. శశికిరణ్ తిక్కా దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీని తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమాను సరైన సినిమా సమయంలో విడుదల చేస్తామని అడివి శేష్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వేసవి కానుకగా ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ భాషలలో మే 27న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ హృదయమా… అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు. మహేష్ బాబు జీఎంబి ఎంటటైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

‘Major’ Movie Release on May 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News