అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా భారీగా నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. హైదరాబాద్‌లో ‘ఇండియా లవ్స్ మేజర్’ కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది.
‘మేజర్’ని నేను సినిమాగా చూడటం లేదు… ఇది ఎమోషన్. ఈ చిత్రానికి మరింత పెద్ద విజయాన్ని అందించాలని కోరుతున్నా”అని అన్నారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. “మేజర్… అడవి శేష్ డ్రీం ప్రాజెక్ట్. మేజర్ సందీప్ రియల్ హీరో. అతని జీవితం ఆధారంగా ఈ గొప్ప సినిమా చేయడం ఆనందంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సయీ మంజ్రేకర్, శరత్, వంశీ పచ్చిపులుసు, శ్రీ చరణ్ పాకాల, అనీష్ కురువిల్లా తదితరులు పాల్గొన్నారు.
Major Movie Unit Success Meet