Tuesday, January 21, 2025

కాంగ్రెస్‌పై మూకుమ్మడి దాడి!

- Advertisement -
- Advertisement -

కడియం కావ్యపై బిఆర్‌ఎస్, బిజెపి, ఎంఆర్‌పిఎస్ నేతల విమర్శనాస్త్రాలు

పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానంపై రసవత్తర రాజకీయం నెలకొంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు ప్రధాన పార్టీలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య బిఆర్‌ఎస్ అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వా త కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా టికెట్‌ను చేజిక్కించుకొని బరిలో నిలిచారు. అధికా ర పార్టీకి చెందిన బలమైన అభ్యర్థిగా భావిస్తూ బిఆర్‌ఎస్, బిజెపి ఎంఆర్‌పిఎస్ ఆమెపై మూకుమ్మడి దాడికి దిగుతున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ముక్కుసూటి మనస్తత్వమే కాకుండా మచ్చలేని నాయకునిగా, ఉమ్మడి జిల్లా పార్టీ నాయకునిగా ఎంఎల్‌ఎగా, మంత్రిగా, డిప్యూటీ సిఎంగా ఆయన పదవులను పొంది అనుభవాన్ని గడించారు.

ఆయన వారసత్వాన్ని అందించేందుకు తన కూతురు కడియం కావ్యకు ఎంపి టికెట్ ఇప్పించి రాజకీయాల్లో స్థిరపరిచేందుకు తన వ్యూహానికి బిఆర్‌ఎస్‌లోనే బీజం వేశారు. గులాబీ పార్టీ నుంచి ఆమెకు వరంగల్ ఎంపి టికెట్ ఇచ్చేవిధంగా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా వరంగల్ లోక్‌సభ స్థానానికి కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఒకసారిగా కడియం శ్రీహరి బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కూతురు కడియం కావ్యకు వరంగల్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటన చేసింది. ఊహించని పరిణామాలతో బిఆర్‌ఎస్, బిజెపి నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటివరకు కాంగ్రెస్, బిజెపి ఈ స్థానానికి అభ్యర్థులను ప్రకటించలేదు.

బిఆర్‌ఎస్ ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్లలో జనగామ, స్టేషన్ ఘనపూర్ తప్ప అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను అధికార కాంగ్రెస్ కైవసం చే సుకుంది. కడియం శ్రీహరికి అనుభవంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాపై పట్టు ఉన్నందున తన కుమార్తెకు బిఆర్‌ఎస్ టికెట్‌ను గులాబీ దళపతి కెసిఆర్ ఇచ్చి ఉంటారని పార్టీ శ్రేణుల్లో కొందరు కావ్యకు మద్దతు తెలిపినప్పటికీ ఉద్యమకారులు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించా రు. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట మాజీ ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ బిఆర్‌ఎస్ టికెట్ తనకు రాలేదని బిజెపిలో చేరి వరంగల్ పార్లమెంటు టికెట్ సాధించుకున్నారు. ఈ పరిణామంతో బిఆర్‌ఎస్‌లో ఒక్కసారిగా అసమ్మతి మంటలు లేచాయి. ఇదిలా వుండగా పార్టీలో ఎవరూ సహకరించే పరిస్థితి లేదనుకున్నా కడియం కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పారు.

తండ్రి, బిడ్డను కాంగ్రెస్‌లో చేర్చుకున్న పార్టీ వారంలోపే కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం ఖ రారు చేసింది. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి పార్లమెం టు సెగ్మెంట్ పరిధిలోని మంత్రి, ఎంఎల్ ఎలను కలిసి కావ్య గెలుపు కోసం సహకారాన్ని అందించాలని కోరారు. అధిష్ఠానం ఆదేశాలను శిరసావహిస్తామని, కడియం కావ్య గెలుపు కోసం కృషి చేయడమే కాకుండా భారీ మెజార్టీతో గెలిపిం చే బాధ్యతను తాను తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎంఎల్‌సి కొండా మురళీధర్ రావు, వరంగల్ పార్లమెంటు ఇ న్‌ఛార్జి, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎంఎల్ ఎలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు కడియం శ్రీహరికి, ఆయన కుమార్తె కావ్యకు హామీ ఇచ్చారు.

ఈ మేరకు పార్టీ లైన్ ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచార కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. కాగా ప్రత్యర్థి పార్టీలైన బిజెపి టిఆర్‌ఎస్‌తో పాటు బిజెపికి మద్దతు ఇస్తున్న ఎంఆర్‌పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ కడియం శ్రీహరి రాజకీయ వ్యవహార శైలిని తప్పుపడుతూ ఆమె కూతురు ఎస్‌సి రిజర్వేషన్‌కు అర్హురాలు కాదని ఏకంగా వాదనకు దిగారు. దీనిపై నా లుగు రోజులుగా వరంగల్ పార్లమెంటు పరిధిలో బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ఎంఆర్‌పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఎక్కడికక్కడే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వీటిని తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వరంగల్ పార్లమెంటు పరిధిలోని ప్రజా ప్రతినిధులతో కౌంటర్ ఇప్పించింది. ఆ కౌంటర్‌తో కొత్త రాజకీయానికి తెరలేసి రసవత్తర రాజకీయం మొదలైంది.

కడియంను ఓడించేందుకు అందరూ ఒక్కటయ్యారా
కాంగ్రెస్ నుంచి బంపర్ ఆఫర్ పొందిన కడియం శ్రీహరికి ప్రతి 15 నెలలకు ఒకసారి అదృష్టం ద న్నుకు వస్తుందని, ఈసారి కూడా ఆయనకు, ఆయన కూతురికి కాం గ్రెస్ అధిష్ఠానం అదృష్టాన్ని ప్రసాదించిందని, ఎట్టి పరిస్థితిలోనూ వారిని ఓడించి తీరాలని బిజెపి ఎంఆర్ పిఎస్‌లకు సంబంధించిన అభ్యర్థులు, నాయకులు కం కణబద్ధులైనట్లు ఆరోపణలు ప్రచార పనులు చేస్తూ వస్తున్నారు. వీటిని బట్టి మూడు పార్టీలకు సంబంధించిన నేతలు, వ్యక్తులకు, తాము గెలవడం కన్నా కడియం ఓటమి ప్రధానమనే రీతిలో వారి ప్రచార అస్త్రాలు ఉన్నా యి. వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్లో ప్రస్తుతం కాంగ్రెస్ బలంగా ఉంది. 7 నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఉన్నారు. అన్నిటికీ మించి ఎస్‌సి నియోజకవర్గాలతో పాటు జనరల్ నియోజకవర్గా ల్లో సీనియర్ నేతలు ఉండడంతో కాంగ్రెస్ అంతర్గత సమస్యలు తెరపైకి రావడం లేదు.

దానితో కాంగ్రెస్ పార్టీకి ఐకమత్యం అనేది కలిసి వచ్చిన అంశంగా మారడం వల్ల బిజెపి, బిఆర్‌ఎస్‌లకు కంట్లో నలుసుగా మారినట్ట యింది. కడియం శ్రీహరికి మాదిగలు మద్దతు ఇవ్వరని, అందులోనూ కడియం కావ్య ఎస్‌సినే కాదని చెబుతున్న వాదనను పైకి తీసుకొస్తున్నప్పటికీ పార్టీలపరంగా ఎవరి క్యాడర్ వారికే ఉంటున్నది. దానివల్ల కడియం కావ్యపై తీసుకొచ్చిన ఎస్‌సి వ్యతిరేక వాదనను మాదిగలు పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లలో ఒకటైన ప్రచారాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనే తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ప్రస్తుతం అదే రీతిని కాంగ్రెస్ కొనసాగించనుంది. ఎంఆర్‌పిఎస్ ఎస్‌సి వర్గీకరణ కోసం బిజెపికి మద్దతిస్తున్నప్పటికీ దళితులు ఎక్కువ సంఖ్యలో బిజెపికి ఆకర్షితులు కాలేకపోతున్నారు. దళితులు అంతా ఎక్కువ శాతం బిజెపి మినహా ఇతర పార్టీలలో మమేకమవుతూ ఉంటారు. ఈ ఎన్నికల్లో ఎంఆర్‌పిఎస్ బిజెపికి మద్దతు ఇవ్వాలని ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ దళిత సామాజిక వర్గం ఎటువైపు మొ గ్గుతుందా అనేది చూడాల్సి ఉంది.

కడియంకు వెన్నుదన్నుగా రేవూరి
కాంగ్రెస్‌లో కడియం శ్రీహరికి పూర్వ సహచరులు, మిత్రులు తోడవుతున్నారు. వారిలో ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా నియమితులైన పరకాల ఎం ఎల్‌ఎ రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు బాధ్యత వహిస్తూ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలోనే వారంరోజులుగా పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న రేవూరి ప్రకాష్‌రెడ్డికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని వర్గాలతో బలమైన సామాజిక వర్గాలతో సంబంధాలు ఉ న్నాయి. మాటకు కట్టుబడి నైజంతో పాటు సీనియర్ శాసనసభ్యునిగా పేరున్న రేవూరు ప్రకా ష్‌రెడ్డికి డిప్యూ టీ స్పీకర్ హోదాను ఇప్పటికే ప్రభుత్వం కట్టబెట్టింది.

లోక్‌సభ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గట్టి ఎక్కిస్తే ఆయనకు మంత్రి పదవి ఖరారు కావచ్చని సమాచారం. కొండా మురళి, మంత్రి కొండా సురేఖలతో రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరికి మంచి సంబంధాలు మునుపటి నుండే ఉన్నాయి. ప్రస్తుతం ప్రస్తుతం ఆ సంబంధాలు లోక్‌సభ ఎన్నికలో ఎంతగానో దోహదపడతాయని బలంగా నమ్ముతున్నారు. కడియం శ్రీహరి రాజకీయ భీష్మాచార్యులుగా పేరొందారు. ప్రస్తుతం ప్రస్తుతం కాంగ్రెస్‌లోని సీనియర్లకు వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో సీటును గెలిపించడమే కాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వరంగల్ జిల్లా వెన్నుదన్నుగా నిలిచే విధంగా నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇదే ఐక్యత ఎన్నికల వరకు కొనసాగితే ప్రభుత్వంలో పార్టీ అభ్యర్థి గెలవడం సునాయాసమనే చర్చ కాంగ్రెస్‌లో కొనసాగడం విశేషం.

కామగోని శ్రీనివాస్/
వరంగల్ బ్యూరో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News