ఆగ్రా: ఉత్తర్ ప్రదేశ్‌లో భారీ వైద్య కుంభకోణం బయటపడింది. ఆగ్రాతోపాటు పరిసర జిల్లాలలో తమ పేర్లతో రిజస్టేషన్ చేసిన 449 ఆసుపత్రులలో 15 మంది డాక్టర్లు పూర్తికాలం సేవలు అందచేస్తున్నట్లు ఇటీవల ఆసుపత్రులు, క్లినిక్‌ల లైసెన్సు రెన్యువల్ దరఖాస్తుల పరిశీలన సందర్భంగా బయటపడింది. వీరిలో ఒక డాక్టర్ పేరుమీదే మీరట్, కాన్పూర్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇతర జిల్లాలలో 83 ఆసుపత్రులు రిజిస్టర్ అయ్యాయి. ఈ డాక్టర్లకు నోటీసులు జారీచేశామని, ఈ కుంభకోణాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చీఫ్ మెడికల్ ఆఫీసర్(సిఎంఓ) అరుణ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.
మెడికల్ ప్రాక్టీషనరు్ల కాని కొందరు వ్యక్తులు ఆసుపత్రులు, క్లినిక్‌లు, పాథాలజీ ల్యాబ్ లను నిర్వహించడానికి డాక్టర్ల పేరు మీద లైసెన్సు కోసం ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేసుకుంటున్నారని వర్గాలు తెలిపాయి.
అయితే..ఈ ఏడాది నుంచి లైనెన్సు రెన్యువల్‌ను ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఈ కుంభకోణం బయటపడింది. నిందితులుగా గుర్తించిన మెడికల్ ప్రాక్టీషనర్లలో ఫిజీషియన్లు, కార్డియాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, సర్జన్లు ఉన్నారు. ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం 2022-23 సంవత్సరంలో మొత్తం 269 మెడికల్ సెంటర్లురిజిస్టర్ అయ్యాయి. వీటిలో 494 ఆసుపత్రులు, 493 క్లినిక్‌లు, 170 పాథాలజీ ల్యాబ్‌లు, 104 డయాగ్నస్టిక్ సెంటర్లు, 7 శాంపిల్ కలెక్షన్ సెంటర్లు, ఒక డయాలసిస్ సెంటర్ ఉన్నాయి.
దరఖాస్తులను పరిశీలించిన తర్వాత 2023—24 సంవత్సానికి 570 ఆసుపత్రులు, క్లినిక్‌ల రిజిస్ట్రేషన్‌ను ఆరోగ్య శాఖ రెన్యు చేసింది.