Wednesday, January 22, 2025

పట్నం.. పల్లెబాట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సంక్రాంతి పండగ సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పట్టారు. తెలంగాణ నుంచి ఏపి వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. 2 కిలోమీటర్ల వరకు వాహనాలు క్యూ కట్టాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల సందడిని తగ్గించేందుకు అధికారులు ఫాస్ట్ ట్యాగ్ విధానం అమల్లోకి తెచ్చారు. అయినా వాహనాల క్యూ మాత్రం తగ్గడం లేదు. వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో విజయవాడ వైపు 10 గేట్లు తెరిచినప్పటికీ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం గమనార్హం.

దీంతోపాటు రైల్వేస్టేషన్‌లు, ఎంజిబిఎస్, జేబిఎస్ బస్టాండ్‌లు సైతం ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. రైళ్లలో రిజర్వేషన్‌లు దొరక్కపోవడంతో జనరల్ బోగీల్లోనైనా వెళ్లాలన్న తాపత్రయంతో ప్రయాణికులు భారీగా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. రైళ్లో రిజర్వేషన్‌లు దొరకని ప్రయాణికులు బస్సుల్లోనూ వెళ్లడానికి భారీగా ఇమ్లీబన్‌కు తరలివస్తుండడంతో ఆ ప్రాంతమంతా ప్రయాణికుల రాకతో సందడిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News