Tuesday, September 17, 2024

రేతిబౌలిలో పగిలిన జలమండలి పైప్‌లైన్

- Advertisement -
- Advertisement -

Major water pipeline bursts in Hyderabad

బురదమయంగా మారిన రహదారులు
మెహిదిపట్నం,అత్తాపూర్ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్
బోర్డు అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు

హైదరాబాద్: జలమండలి అధికారులు నీరు వృథా కాకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఏదో ఒక చోట పైపులైన్లు నాసిరకం ఉండి పగలడంలో బోర్డు నిర్లక్షం బయటపడుతుంది. ప్రజలకు నీరందించేందుకు నాణ్యమైన పనులు చేసి, సకాలంలో నీటి సరఫరా చేస్తామనే అధికారుల ప్రకటనలు ప్రజలు మభ్యపెట్టడానికేనని నగర ప్రజలు మండిపడుతున్నారు. గుత్తేదార్లు చేసే పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావంటున్నారు. శనివారం నగరంలో లంగర్‌హౌజ్ రేతిబౌలిలో జలమండలి ఏర్పాటు చేసిన తాగునీటి పైప్‌లైన్ పగిలింది. పివిఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబరు 53వద్ద ఈఘటన జరిగింది. దీంతో మెహిదిపట్నం, అత్తాపూర్ రహదారిపై భారీగా నీరు చేరింది.

ప్లైఓవర్ ఎత్తు ఎగిసిపడటంతో ఆమార్గంలో గంట పాటు ట్రాఫిక్ స్దంభించింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమీప ప్రాంతాల ప్రజలు స్దానిక వాటర్‌బోర్డు అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆపైపు ద్వారా రాకుండా మెయిన్ పైప్‌లైన్లు వద్ద నిలిపివేశారు.దీంతో ఒక రోజు ప్రజలు తాగే నీరు నేలపాలైందని అధికారులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు నీటి ప్రవాహం పెరిగితే పైపులు తట్టుకోలేక పగిలిపోతాయని లైన్‌మెన్లు చెబుతున్నారు.అంతేగాకుండా పైపులైన్ రోడ్డు పక్క ఉండటంతో బారీ వాహనాలు వెళ్లుతుండటంతో దెబ్బతిని ఆకస్మాత్తుగా పగులుతాయని వెల్లడిస్తున్నారు. పైపులైన్లు పగిలి నీరు పోవడంపై స్దానిక ప్రజలు జలమండలి అధికారులు ఎప్పడుకప్పుడు పైపులైన్లు పర్యవేక్షించి తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News