ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం; పరపీడన పరాయణత్వం; నరజాతి చరిత్ర సమస్తం అన్న శ్రీశ్రీ మాటలు అందరికీ గుర్తే. వారన్నట్టుగా బానిసత్వం మానవ సమాజంలో అంతర్భాగం అనడానికి అనేక మచ్చుతునకలుగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మంది పిల్లలలో ఒకరు పని చేస్తున్నారు. నేడు జరుగుతున్న బాలకార్మికులలో ఎక్కువ భాగం ఆర్థిక దోపిడీ కోసమే. ఇది బాలల హక్కుల ఒప్పందానికి విరుద్ధం. ఇది ఆర్థిక దోపిడీ నుండి, పిల్లల చదువుకు ఆటంకం కలిగించే లేదా హాని కలిగించే అవకాశం ఉన్న ఏదైనా పని నుండి రక్షించబడే పిల్లల హక్కును గుర్తించింది. పిల్లల ఆరోగ్యం లేదా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక లేదా సామాజిక అభివృద్ధి అనేది ముఖ్యం. ఆధునిక బానిసత్వం ప్రధాన రూపాలు బానిసత్వం చరిత్రలో వివిధ మార్గాల్లో అభివృద్ధి చెందిందని వ్యక్తీకరించబడింది.
బానిసత్వం కొన్ని వాటి పూర్వపు రూపాల్లోనే కొనసాగుతుండగా, మరికొన్ని కొత్తవిగా రూపాంతరం చెందాయి. యుఎన్ మానవ హక్కుల సంస్థలు సాంప్రదాయ విశ్వాసాలు మరియు ఆచారాలలో పొందుపరచబడిన పాత రకాల బానిసత్వం నిలకడను నమోదు చేశాయి. ఈ బానిసత్వం రూపాలు సమాజంలోని అత్యంత దుర్బలమైన సమూహాలపై దీర్ఘకాలిక వివక్ష ఫలితంగా ఉన్నాయని తెలిపింది. నిర్బంధ శ్రమ, ఋణ బంధం వంటి సాంప్రదాయిక రకాలైన బలవంతపు శ్రమలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతి రకమైన ఆర్థిక దోపిడీకి రవాణా చేయబడిన వలస కార్మికులు బలవంతపు శ్రమ సమకాలీన రూపాలు ఉన్నారు. బలవంతంగా పనిచేస్తున్నటువంటి వారిలో పిల్లలు ఒకరుగా ఉన్నారు. ప్రైవేట్ రంగంలో సుమారు 86% మంది ప్రజలు బలవంతపు పనులే చేస్తున్నారు. బలవంతపు వాణిజ్య లైంగిక దోపిడీకి గురైన వారిలో దాదాపు ఐదుగురిలో నలుగురు మహిళలు ఉంటున్నారు.
ఇలా వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ, వారిని నియంత్రణలో ఉంచుకుంటూ, లాభార్జన చేస్తూ, శ్రమ దోపిడీకి పాల్పడేటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇవే కాక లైంగిక దోపిడీకి కూడా పాల్పడుతున్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నపిల్లలను సైన్యంలో ఉపయోగించడం, బలవంతపు పెళ్లిళ్లు చేయడం వంటివి అన్నీ కూడా బానిసత్వం కింద గుర్తించవచ్చు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది బానిసత్వంలో ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద వెట్టి చాకిరి చేస్తున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? వారి జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుంది? బాలకార్మికులు ఏయే ప్రాంతాలలో పనిచేస్తున్నారు? దాని నుండి విముక్తి చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది.
శ్రమ దోపిడీకి గురవుతున్న వారి స్థితిగతులు ఏంటని పరిశీలించగా ఎక్కువ మంది క్వారీలు, ఇటుక తయారీ పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలు, పట్టు పరిశ్రమలు, కొన్ని పారిశ్రామిక రంగాల్లో అనగా బట్టల ఫ్యాక్టరీ, చెప్పుల ఫ్యాక్టరీ వాటిలో కూలి పనులు చేస్తున్నారని గుర్తించడం జరిగింది. పరిశ్రమలు నిర్వహించేటువంటి పారిశ్రామికవేత్తలు, వివిధ షాపింగ్ మాల్స్ ఓనర్లు రోజుకు 16 గంటలకు పైనే వారితో పని చేయించుకుంటున్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మెలగాలి. అలా అందరూ నడుము కట్టి ముందుకు సాగినప్పుడే ఈ బానిస వ్యవస్థను రూపుమాపిన వారమవుతాం.100% కాకున్నప్పటికీని కొంత మందినైనా ఈ వ్యవస్థనుండి రక్షించిన వారమవుతాం.
డా. మోటె చిరంజీవి
9949194327