Friday, December 27, 2024

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. స్థానిక న్యూ టౌన్‌లోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జి ల్లా కేంద్రంలోని మైమాన్ కమిటీకి చెందిన మహ్మ ద్ సిరాజ్, మహ్మద్ పురాన్, మహ్మద్ ఫరహన్, జహీదాభాను, రిజ్వానా భాను, నసీం, రహమత్ ఉ న్నిసా, సుల్తానా సహ సుమారు 150 మంది మైనా ర్టీ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో అధికార బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో 6 మైనార్టీ గురుకుల పాఠశాల లు, 6 జూనియర్ కళాశాలలు, ప్రారంభించబడ్డాయన్నారు.

ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ. 1.20 లక్షల చొప్పున ఏటా రూ. 45.84 కోట్ల వరకు ప్ర భుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు.నూతన మైనార్టీ గు రుకులాల నిర్మాణం కోసం రూ. 128 కోట్లు మం జూరై ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఈ పథకం ద్వా రా రూ. 3.42 కోట్ల మేర అందించామన్నారు. డ్రై వర్ ఎంపవర్మెంట్ పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు వాహనాలు కొనుగోలు చేసేందుకు రుణాలు అందించామన్నారు. నియోజకవర్గంలో 20,355 మంది విద్యార్థులకు రూ. 31.12 కోట్ల మేర ఉపకార వేతనాలు ఇచ్చినట్లు తెలిపారు.

మైనార్టీ విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ సౌకర్యాన్ని కల్పించామని ఇప్పటి వరకు ఇందుకై రూ. 1.26 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. షాదీముబారక్ పథ కం ద్వారా 2016 నుండి నేటి వరకు నియోజకవర్గంలో 2940 మంది లబ్దిదారులకు రూ. 28.49 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం అందిస్తూ తమ ప్రభు త్వం అండగా నిలిచిందన్నారు. కుల మతాలకు అ తీతంగా తమ ప్రభుత్వం అందరి సంక్షేమానికి క ట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ప్రధాన కార్యదర్శి వినోద్, నాయకులు ముక్తదీర్, అబ్దుల్ ఖాదర్ , మహ్మద్ పైజాన్, మీర్జా జావేద్ బేగ్ , మహ్మద్ వాజీద్, హరున్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News