Monday, January 20, 2025

రొమాంటిక్‌గా మురిపిస్తూ…

- Advertisement -
- Advertisement -

 Major's first single Hrudayam to release on Jan 7th
ముంబయ్ ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. ‘మేజర్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘హృదయమా…’ ఈ నెల 7న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ పాటకు విఎన్‌వి రమేష్, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా..సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సాంగ్‌ను అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటపై రొమాంటిక్ పాటగా చిత్రీకరించారు. ఇక ఇటీవలే ఈ సినిమా హిందీ వర్షన్‌కి డబ్బింగ్ ప్రారంభించారు హీరో అడివి శేష్. ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకింగ్‌తో జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో ‘మేజర్’ సినిమా తెరకెక్కింది. మహేష్ బాబుకు చెందిన జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ+ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 Major’s first single Hrudayam to release on Jan 7th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News