Friday, December 20, 2024

సాహాను బెదిరించిన జర్నలిస్ట్‌కు బిసిసిఐ షాక్

- Advertisement -
- Advertisement -


ముంబై: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన స్పోర్ట్ జర్నలిస్ట్‌కు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) షాక్ ఇచ్చింది. సాహాను వేధింపులకు గురి చేసిన సీనియర్స్ స్పోర్ట్ జర్నలిస్ట్ బోరియా మజుందార్‌పై బిసిసిఐ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని బిసిసిఐ బుధవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. బిసిసిఐ ఆదేశాల ప్రకారం.. బోరియా మజుందార్ రెండేళ్ల పాటు జరిగే దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి కవరేజీ చేయకుండా ఆంక్షలు విధించింది. మజుందార్‌కు రెండేళ్ల పాటు బిసిసిఐ అక్రిడేషన్ పొందడంపై నిషేధం ఉంటుందని ప్రకటించింది. అంతేగాక బిసిసిఐతో కాంటాక్ట్ ఉన్న ఏ క్రికెటర్‌తో కూడా ఇంటర్వూ చేయకూడదని సూచించింది. ఇదిలావుండగా ఇంటర్వూ ఇవ్వనందుక ఓ పాత్రికేయుడు తనను బెదిరించాడని సాహా ఈ ఏడాది ఫిబ్రవరిలో వాపోయాడు. సాహా ఆరోపణలపై స్పందించిన బిసిసిఐ విచారణ జరిపింది. విచారణలో మజుందార్ ఇంటర్వూ పేరిట సాహాను బెదిరించిన విషయం నిజమేనని తేలింది. దీంతో బిసిసిఐ అపెక్స్ కమిటీ ఆ జర్నలిస్ట్‌పై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News