Sunday, January 19, 2025

శబరిమలలో మకర జ్యోతి దర్శనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అయ్యప్పనామ స్మరణతో శబరిమల మారుమ్రోగింది. శనివారం సాయంత్రం అయ్యప్ప భక్తులకు మూడుసార్లు మకరజ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు ఆనందపరవశంలో మునిగిపోయారు. పొన్నంబలమేడు శబరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఇక్కడినుంచే భక్తులకు మూడుసార్లు మకరజ్యోతి దర్శనమిచ్చింది. లక్షలాది భక్తుల నిరీక్షణకు తెరవేస్తూ ఆలయానికి ఈశాన్య దిశలోని పర్వతశ్రేణుల నుంచి మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఈ జ్యోతిని తిలకించిన భక్తులు స్వామియే శరణం అయ్యప్పా అంటూ స్మరించుకున్నారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలిరావడంతో అయ్యప్ప నామస్మరణతో శబరి గిరులు మార్మోగాయి.

కాంతమల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతకుముందు పందళం నుంచి తీసుకొచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామి వారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతినిచ్చారు. ఆ వెంటనే చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. ఈ జ్యోతిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏడాది జనవరి 14వ తేదీన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే.

.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News