Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో సంక్రాంతి సరదాలు

- Advertisement -
- Advertisement -
Makar Sankranti festival 2022
కరోనా ఎఫెక్ట్‌తో కొంత ఇబ్బందులు.. చైనా మాంజాతో ముప్పు

హైదరాబాద్: సంక్రాంతి పండుగంటే ప్రపంచమంతా ఒకెత్తూ, హైదరాబాద్ మహా నగరం మరొక ఎత్తు. ఈ విషయాన్ని నగర వాసులే కాదు, హైదరాబాద్ కి వచ్చిన టూరిస్టులు కూడా చెబుతారు. ఈ పండుగ వస్తే నగరంలో ఉండే కోలాహలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గాలిపటాలు. హైదరాబాద్ విస్తరిస్తున్న తొలినాళ్లలో ఈ పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం కనబడనన్ని గాలిపటాలు ఎగురేసేవారు నగరవాసులు. ఇదే క్రమంలో మెట్రో రైలు మార్గంతో పాటు పెద్ద పెద్ద భవనాలు వెలిసిన ప్రస్తుత నేపథ్యంలోను పంతుంగులు ఎగురవేయడంలో యువత అంతే ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలో ఏ ఊళ్ళోనూ నిర్వహించనంత ఘనంగా పంతంగుల పండుగను ఇక్కడ జరుపుకోవడం అనావాయితీగా వస్తోంది.

నగరంలో మెట్రో రైలు ఆకాశ మార్గంతో పాటు పెద్ద పెద్ద బిల్డింగులూ వెలిసినా ఈ పండుగకు మాత్రం ఆదారణ తగ్గతేదు. చిన్నారులు మొదలు పెద్దల వరకు సెల్‌పోన్ మైకంలో మునిగితెల్లుతున్నా ప్రస్తుత తరుణంలో సైతం ఈ పండుగ వచ్చిందంటే చాలు ఇక్కడి యువత పంతుంగుల ఎగురవేస్త్తూ బిజీబిజీగా గడుపుతుంటారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా దొరకని పంతుంగులు హైదరాబాద్ నగరంలో లభించడం విశేషం. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని వ్యాపారాల మాదిరిగా ఈ వ్యాపారం సైతం దెబ్బతింది. ఇదే క్రమంలో 2021లో ప్రధాన పండుగలు ఘనంగా జరుపుకున్నప్పటకీ సంక్రాంతి నాటికి ఒమిక్రాన్ రూపంలో మూడో ముప్పు ముంచుకురావడంతో యువత కొంత నిరాశకు గురవుతున్నారు.

చైనా మాంజాతో పొంచిఉన్న ప్రమాదం 

చైనానుంచి దిగుమతి చేసుకునే మాంజాని ప్రమాదకరమని గుర్తించిన ప్రభుత్వం దీనిని గతంలోనే నిషేదించింది. అయినా యువత మాత్రం ఈ మాంజాను దొంగచాటు కొనుగోలు చేస్తూ పోటా పోటీగా పంతుంగులను ఎగురువేస్తున్నారు. ఈ మాంజాన ఉపయోగించడం వల్ల ఎదుటివారి పంతుంగుల ఎక్కువ సంఖ్యలో తెగిపోయేలా చేసే అవకాశం ఉండడంతో ఈ మాంజా వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే చైనా మాంజాలో అత్యంత ప్రమాదకర రసాయానాలను కలిపి తయారు చేస్తుండడంతో ఇది పర్యావరణంతో పాటు మనిషులకు కూడా ప్రమాదకంగా మారుతొంది. అంతేకాకుండా కొంత మంది సంఘ విద్రోహ శక్తులు దీనిని ఆయుధంగా మార్చుకుని ప్రాణాలు హరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News