Monday, December 23, 2024

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్ ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. ఎపి, తెలంగాణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్‌లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు. మచిలీపట్నం టు -కర్నూలు, మచిలీపట్నం టు -తిరుపతి, విజయవాడ- టు నాగర్‌సోల్, కాకినాడ టౌన్- టు లింగంపల్లి, పూర్ణ-తిరుపతి, తిరుపతి- అకోలా, మచిలీపట్నం- టు సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు.

మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ (07067 రైలు) ప్రతి శనివారం, మంగళవారం, గురువారం నడుపనున్నట్టు అధికారులు తెలిపారు. 2023 జనవరి 3, 5, 7, 10, 12, 14, 17వ తేదీన మచిలీపట్నం నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. మచిలీపట్నం, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, నరసరావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంబం, గిద్దలూరు, నంద్యాల, డోన్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం వరకు ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం , 2023 జనవరి 4, 6, 8, 11, 13, 15, 18వ తేదీన ఈ రైలును నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News