ఏది సంక్రాంతి
ఏమైపోయింది క్రాంతి
ఎక్కడుంది కాంతి
దొరుకుతుందా శాంతి
అడగంటుతున్న సదాచారాలు
అదృశ్యమవుతున్న సంప్రదాయాలు
కనిపించని జానపద కళలు
మొక్కుబడిగా జరుగుతున్న వేడుకలు
ఆశించినమేర జరగని సంబరాలు
హరి దాసుల సంచారం
అంతంత మాత్రంగా ఉంది
గంగిరెద్దుల కోలాహలం కనిపించకుంది
జనంలో ప్రేమానురాగాలు సన్నగిల్లాయి
మమతానుబంధాలు మాయమైయ్యయి
ముగ్గు కాస్త సిగ్గుతో బయటకు రాకుంది
గోబ్బేమ్మల చిరునామా కాన రాకుంది
రైతన్నల కళ్ళలలో ఆనందం లేకుంది
యువత లో హోషారు తగ్గిపోయింది
దాన ధర్మాలు దారి తప్పాయి
పండగ పరమార్థం నెరవేరకుంది
ఎడ్ల పందెల జోరు లేనే లేదు
కోడి పందెల పోరు కాన రాదు
నగరంలో సంక్రాంతి అటకెక్కింది
అసలైన సంక్రాంతికి పలుకుదాం స్వాగతం
సంస్కృతీ, సంప్రదాయయాలను
రక్షించు కుందాం
మానవ సంబంధాల ను పెంచుదాం
మమతానురాగాలను పంచు దాం
సంక్రాంతి సంబరాలును
బాగా జరుపుకుందాం
* ఆచార్య గిడ్డి వెంకటరమణ- 9440984416