Wednesday, January 22, 2025

ఈ ఏడాది మకర రాశివారి సంపాదన ఖర్చులకు సరి!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 14 వ్యయం : 14
రాజ : 03 అవమానం : 01

ఉత్తరాషాఢ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2 పాదముల యందు పుట్టినవారు “బో, జా, జీ, జూ, జే, ఖా, గా, గీ” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మకరరాశికి చెందినవారు.

మకరరాశి వారికి ఈ సంవత్సరం కొంత వరకు శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార రం గంలో ఉన్న వారికి కొంత వరకు అనుకూల కా లం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సెద ర, సెదరీల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి.

. దాని ద్వారా మీరు లాభపడతారు. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం.
విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. కుటుంబ పెద్దలను సంతోష పెట్టడం లో కొంత కష్టపడాల్సి వచ్చును. దైవానుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంత వరకు సంతృప్తి పొందుతారు. సంవత్సర ప్రధమార్ధంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.

మీ ఆర్ధిక మూలాలను ప్రకటించి మిమ్మల్ని దెబ్బ తీయాలని చేసే ప్రయత్నాలు మిమ్మల్ని కొంత వరకు ఇబ్బందికి గురి చేస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తారు. గృహంలో చేసే శుభ కార్యాలు అనుకూలిస్తాయి. మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మీ ధైర్య సాహసాలు కొంత వరకు మిమ్మ ల్ని ముందుకు నడిపిస్తాయి. మీ నిర్ణయాలు, ఆలోచనలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పదగిన సూచ న. ప్రభుత్వ సంబంధమైన పనుల కన్నా, ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తా రు. వృత్తిఉద్యోగాలలో స్థాన చలనం ఉన్నది. స్పె క్యులేషన్ లాభిస్తుంది. సుగంధ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారు, చిన్నపాటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వృత్తిఉద్యోగ, వ్యాపారాల పరం గా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ బ రువు బాధ్యతలు పెరుగుతాయి, కష్టపడి పనిచేస్తారు. మంచి ప్రయోజనాలు పొందుతారు. పెట్టుబడిపెట్టి మోసపోయిన ఫైనాన్స్ కంపెనీల నుండి డబ్బులు రావు.

మీ శ్రమను, శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కొంతమంది వ్యక్తు లు ఇవ్వవలసిన ప్రతిఫలం కన్నా తక్కువ ఇచ్చి ఎంతో చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తా రు. ఆ ధనాన్ని మీరు తిరస్కరిస్తారు.
మీ ఆధ్వర్యంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు మంచి పురోగతి, అభివృద్ధిని సాధిస్తాయి. తీర్థయాత్రలు చేయడం, ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం కొంత వరకు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. అన్నిటికీ దేవుడే దిక్కు అనే మీ మానసిక ఆలోచన మీకు ప్రశాంతతను ఇ స్తుంది. ఈ సమాజంలో నీతి నిజాయితీ మంచితనం కన్నా ధనమే మిన్న, ధనం మూలం ఇదం జగత్త్ అనే సామెత నిజం చేస్తోందని వేదనకు గురి అవుతారు. ధనం ముఖ్య పాత్ర వహించడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది.
దానివలనే వేదనకు గురి అవుతారు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొని మీ జీవిత గమ్యం, సత్యం ఏంటో మీరు తెలుసుకోవడానికి చేసే ప్ర యత్నాలకు మంచి అనుకూలమైన సమయం. మీ కుటుంబ సభ్యులలో కొంత వరకు అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా కొంత వరకు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మనోవేదనకు మందు లేదు. మనోవేదనకు గురికాకుండా ఉండడం అవసరం. చర్మ సంబంధ వ్యాధులు హిమాగ్లోబిన్, రక్త సంబంధిత వ్యాధులతో జాగ్రత్తలు అవసరం.

కుటుంబంలో అశాంతికి కారణమైన వ్యక్తులను గుర్తించి కూడా మీరు ఏమీ చేయలేరు. మీ కులేని ఉద్దేశ్యాలను మీకు ఆపాదించి రక్త సంబంధీకులకు, సన్నిహితులకు అందరికీ దూరం చే యాలని మీ శత్రుకూటమి విశేష ప్రయత్నాలు చే స్తుంది. ఈ సందర్భంగా ఓ పెద్దమనిషి మీకు అండగా నిలుస్తాడు, ఎలాంటి దుష్పరిణామాలు కలగకుండా చేయగలుగుతాడు. మీ ముందు ఉ న్న బాధ్యతలను, కఠినమైన సవాళ్ళను యాంత్రికంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు కేతు గ్రహ సంచారం వలన జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. ఉండటానికి తాత్కాలికంగా ఉన్నా పెద్ద తుఫానుని సృష్టించే విధంగా ఉంటాయి. ఎన్నో అలజడులు, ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు దుర్భాషలాడుకోకుండా, అర్ధం చేసుకుని సానుకూలంగా స్పందిస్తే కొంత వరకు సమస్య లు రాకుండా సమసిపోతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. కావున రాహుకేతు గ్రహ శాంతికై రాహు గ్రహ దీపం లే దా జపం చేయడం అవసరం. జీవిత భాగస్వా మి విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరిస్తా రు, గతంలో ఏర్పడిన స్పర్థలు మరచిపోయి మం చి ఆలుమగలుగా వ్యవహరిస్తారు.

ఈ ఏడాది సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు, హోల్‌సేల్ మార్కెటింగ్, రిటైల్ మార్కెటింగ్, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, ఆటోమొబైల్స్, నిర్మాణరంగం, ట్రావెల్స్ మొదలైన వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. చెల్లింపులు, రాబడులు కొంతకా లం సరిసమానంగా ఉంటాయి. ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నవారికి, చేతి వృత్తి, పనివారికి, సన్నకారు రైతులకు మంచి అనుకూలమైన కా లం. బంగారం, వెండి రాగి మొదలైన లోహపు వ్యాపారులకు కాలం అద్భుతంగా ఉంటుంది. ఇనుము, స్టీలు మొదలైన వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్లు, చా ర్టెడ్ అకౌంటెంట్‌లకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో డబ్బు రాదు, కమర్షియల్ ట్యాక్స్, ఇన్‌కంట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ అధికారుల వల్ల, ఎసిబి అధికారులవల్ల, విజిలెన్స్ అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త వహించండి.

రచనా వ్యాసాంగాలు, పుస్తక రచన, పరిశోధన, నటన, కళా సంబంధమైన వృత్తి, ఉద్యోగాలలో విశేషమైన నిపుణత కలిగి ఉంటారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. మీలో కొన్ని బలహీనతలు చోటు చేసుకుంటాయి. దురభ్యాసాలవైపు మనస్సు పోతుం ది. సుఖంగా ఉన్న జీవితాన్ని మీకు మీరుగా ఇబ్బందుల పాలు చేసుకుని మీ స్థాయిని మీరే తగ్గించుకుంటారు. అనవసరమైన కొనుగోళ్ళు చేస్తారు. ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. కొన్ని సందర్భాలలో తాత్కాలికంగా భయానికి, భ్రాం తికి లోనవుతారు. కార్మిక వర్గాలకు, మంచి స్ఫూ ర్తిని నింపుతూ, ఉదాహరణగా ఉంటారు. మీ వర్గం ఐకమత్యం దెబ్బతీసే ప్రయత్నాలు నెరవేరవు. యూనియన్స్‌ను సమర్థవంతంగా నడుపుతారు. మీమీద అందరూ నమ్మకం కలిగి ఉంటా రు. కీలకమైనటువంటి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించామన్న సంతృప్తి కలుగుతుం ది. గురు, శుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఏలిననాటి శని నడుస్తుంది కావున కాలభైరవ రూపును మెడలో ధరించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News