- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. శబరిమలలోని పొన్నాంబలమేడు నుంచి భక్తులకు మకరజ్యోతి మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు దర్శనం ఇవ్వడంతో శబరిగిరులన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున పొన్నాంబలమేడు కొండల నుంచి మకరజ్యోతి కనిపించడం పరిపాటి. మకరజ్యోతి దర్శనానికి కేరళ ట్రావెన్ కోర్ బోర్డు కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అయ్యప్పమాల ధరించిన వారు సంక్రాంతి వరకు శబరిమల చేరుకొని, దర్శనం కార్యక్రమాలు పూర్తి చేసుకొని మకర జ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తారు. సరిగ్గా సాయంత్రం దీపాలు పెట్టే సమయానికి జ్యోతి మూడుసార్లు కనిపించి మాయం అవుతుంది. దీనిని ప్రజలు మకరజ్యోతిగా, అయ్యప్పస్వామి మహిమగా భావిస్తారు.
- Advertisement -