Wednesday, January 22, 2025

బేతవోలును ఆదర్శ గ్రామంగా మారుస్తా

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

చిలుకూరు: బేతోవలు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తానని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి 5 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని, ప్రతివర్గాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు.

పేద విద్యార్ధులకు ఉన్నత విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచి మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్షంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి బజ్జూరు వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసిలు సైదబాబు, సొసైటీ ఛైర్మన్ సైదులు, వైస్ ఛైర్మన్ జానకి రామాచారి, గ్రామశాఖ అధ్యక్షులు తాళ్లూరు శ్రీనివాస్, ఉప సర్పంచ్, నాయకులు బాదే ఆంజనేయులు, యగ్గడి రామారావు, ప్రసాద్, బత్తిని శంకర్, రామాలయ ఛైర్మన్ యగ్గడి శ్రీనివాస్, పాలవర్గ సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News