Monday, December 23, 2024

సిఎం సభను జయప్రదం చేయండి

- Advertisement -
- Advertisement -
  • ఎంపి మాలోత్ కవిత

ఇల్లందు టౌన్: నవంబర్ 1న ఇల్లందు పట్టణంలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ సభను జయప్రదం చేయాలని మహబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, స్ధానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా హరిసింగ్‌నాయక్‌లు అన్నారు. ఈ సందర్భంగా వారు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను ముఖ్యమంత్రి చొరవతో పరిష్కరించామన్నారు. ప్రజా సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను దాదాపు లక్షకు మందికి పైగా అందించడం జరిగిందన్నారు. బిఆర్‌ఎస్‌పై ప్రజలకు నమ్మకం పెరిగిందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇల్లందు గడ్డపై ఎన్నడూ లేనివిధంగా గులాబీ జెండా ఎగరవేసి చర్రిత సృష్టించబోతున్నామన్నారు. అంతకముందు వారు బిఆర్‌ఎస్ నాయకులతో కలసి పట్టణంలోని సింగరేణి స్కూల్ మైదానాన్ని పరిశీలించారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ దిండిగాల రాజేందర్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్ జేకే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News