Monday, December 23, 2024

మేక్ ఇన్ ఇండియాలో అందరు భాగస్వాములు కావాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

 

భారత్ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో జరిగిన ఉభయ సభలలో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితమే ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకున్నామని ,రాబోయే 25 ఏళ్లు దేశానికి ఎంతో కీలకమని రాష్ర్టపతి ముర్ము సూచించారు. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని, దేశం ఆత్మనిర్భర్ భాతరంగా ఆవిర్భవిస్తోందని పేర్కొన్నారు. భారత్ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుందని, దేశ ప్రగతిలో నారీ , యువశక్త భాగస్వామ్యం కావాలని ముర్ము కోరారు.

9 ఏళ్ల మా ప్రభుత్వంలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఇతర దేశాల పై భారత్ ఆధారపడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని రాష్ట్రపతి తెలిపారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. మన డిజిటల్ నెట్ వర్క్ అందరికి ఆదర్శమని ఆర్టికల్ 376 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని ద్రౌపతి ముర్ము వెల్లడించారు. అవినీతి రహిత దిశగా భారత్ పయనిస్తోందని , భారత్ అన్ని రంగాల్లో సమృద్ధి లక్ష్యాలను సాధిస్తోందని ఆమె వివరించారు.

ప్రపంచ సమస్యలకు భారత్ పరిష్కారం చూపుతోందని, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామని, పేదల ఆలోచన స్థాయిని కూడా పెంచుతున్నామని ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చామని, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాని ముర్ము తెలిపారు. 50కోట్ల మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం సాగుతుందని, ప్రభుత్వంలో జవాబుదారితనం పెంచామని తెలిపారు. బినామీ ఆస్తులు స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, రికార్టు స్థాయిలో జిఎస్టి వసూళ్లు నమోదయ్యాయని రాష్ట్రపతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News