మంచిర్యాల: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాతో కాంగ్రెస్ ది ప్రత్యేక అనుబంధమని, అభివృద్ధిలో మొదటి అడుగు ఇంద్రవెల్లి సభ నుండే ప్రారంభం అవుతుందని… ఇంద్రవెల్లి సభను అందరూ విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా, స్త్రీలు, శిశు సంక్షేమం మంత్రి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తెలిపారు. మంచిర్యాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…… ఈ ప్రాంత ఎమ్మెల్యేలు గెలిపించడంలో కీలక పాత్ర వహించిన జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాని, ఇక్కడి మారుమూల ప్రాంతాలు, పట్టణ పల్లె ప్రజలు, ఆర్థికంగా ఎదగాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భౌగోళి స్వరూపం పూర్తిగా తనకు తెలుసని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలు కాకుండా, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తానని, అనేక ఉద్యమంలో పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలుచున్నామని ఆమె తెలిపారు. గతంలో జరిగిన ఇంద్రవెల్లి సభ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భుజాల మీద వేసుకొని ముందుండి నడిపించాలని గుర్తు చేశారు. ఆ సభ తోటే కాంగ్రెస్ నాయకులకు స్ఫూర్తి నింపారని అన్నారు.
గత ప్రభుత్వాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందని, అసిఫాబాద్ లో వైద్యులు సరిగా లేక వైద్యం అందలేదని, నిరుద్యోగులను నిలువునా ముంచారని ఆమె తెలిపారు. ఇక్కడి సమస్యలు గుర్తించి అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపడితే ఆ ప్రాజెక్టును ఆపివేసి అవినీతి కుపంగా కాలేశ్వరం చేశారని అన్నారు. అభివృద్ధి పథంలో ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని, నేడు ముఖ్యమంత్రి కేస్లాపూర్ లో నాగోబా జాతర ఆలయ పనులను, శంకుస్థాప పనులు, ఇంద్రవెల్లి సభను, స్మృతి వనం, అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచినీళ్ల సౌకర్యం లేదని, వందలాదిమంది ప్రజలకు పౌష్టిక ఆహారం అందడం లేదని, ఇక్కడి ప్రజలు అధిక శాతం రక్తహీనత జబ్బులతో బాధపడుతున్నా రని, రక్తహీనత ప్రభావం ఎక్కువగా ఉంది, పౌష్టిక ఆహారం అందించడానికి అంగన్వాడి సెంటర్లు ఎక్కువ లేవు, డ్రింకింగ్, ఇరిగేషన్ వసతులు లేక ఇబ్బందికి గురవుతున్నారని,గత ప్రభుత్వం కడెం ప్రాజెక్టు పట్టించుకోవడంలేదని, నిర్లక్ష్యానికి వదిలేసారని ఆమె తెలిపారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తాం ఈ సమస్యను వీలైనంత తొందరలోనే నెరవేరుస్తామని అన్నారు. ఉద్యోగులు సమస్యలు అధికంగా ఉన్నాయని నెల జీతం కూడా సరిగా ఇవ్వలేకపోయారని, తమ ప్రభుత్వం ప్రతినెల 5వ తారీఖు ఇవ్వవలసిందిగా సంకల్పం చేస్తుంది, అంగన్వాడీలు, మంచినీళ్లు, ఇళ్ల సమస్యలు, ఇవేమీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారుల బంగ్లాలు చూపిస్తూ పేదలు ఉండే బంగ్లాలు చూపించకుండా అదే అభివృద్ధి అని చూపించారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటిలో ఉండే మహిళలను దృష్టిలో ఉంచుకొని వారికోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం చేపడితే అది జీర్ణించుకోలేని బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తూ, ఆటో డ్రైవర్ రెచ్చగొట్టే ఉద్యమం చేపట్టారని అన్నారు. తమ రాజకీయ స్వార్థం కోసం ప్రజలకు ప్రయోజనాలు కల్పించలేదని, ఉద్యమకారులకు అన్యాయం చేశారని ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తుత ప్రభుత్వం గుర్తించే అవకాశం ఇస్తే జీర్ణించుకోలేకపోతున్నారని, ధర్నా చౌక్ లేకుండా చేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా అని ఆమె తెలిపారు. అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…. ఆగస్టు, 9,2021 మొట్టమొదటి సభ ఇంద్రవెల్లి లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని, మళ్లీ అక్కడి నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఇంద్రవెల్లి సభలో గతంలో ప్రకటించినట్లు కొన్ని పనులు పూర్తి అయ్యాయని, మరికొన్ని పనులు పూర్తి కావాల్సిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ కు ప్రత్యేక అనుబంధం ఉందని, ప్రస్తుత ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక్కడినుండే పాదయాత్ర మొదలు పెట్టారని గుర్తు చేశారు. మళ్లీ భారీ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని మంచిర్యాల జిల్లాకు ఎల్ఓసిలు 10 కేటాయిస్తే తమ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల 30 ఎల్ ఓ సి లు ఇచ్చామని తెలిపారు. మంచిర్యాల్ పట్టణానికి త్రాగునీటి సమస్య ప్రధానంగా ఉందని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఇటీవల కాలంలో మంచిర్యాలలో తాగునీటి సమస్య తీర్చడానికి మంచినీళ్లు నల్లాలు ఏర్పాటు చేశామని, ఎండాకాలంలోపు పూర్తిస్థాయిలో మంచినీళ్లు అందిస్తామని, వాటర్ ట్యాంకులతో నీళ్లు కాకుండా పూర్తిస్థాయిలో నల్ల కనెక్షన్లు అందిస్తామని ఆయన అన్నారు.
జరగబోయే ఇంద్రవెల్లి సభను మంచిర్యాల్ నియోజకవర్గము నుండి సుమారుగా 135 బస్సులో 7000 నుండి 8000 మంది సభకు తరలివస్తామని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి అంతే స్థాయిలో వస్తారని ఆయన అన్నారు. అంతేకాకుండా మంచిర్యాల్ నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరికీ 15 లక్షల ఇన్సూరెన్స్, ప్రయాణికులకు రెండు లక్షల ఇన్సూరెన్స్ అవకాశాన్ని తొందరలోనే కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు సిరిపురం రాజేశం, తూముల నరేష్, పూదరి ప్రభాకర్, రావుల ఉప్పలయ్య, డాక్టర్ గణేష్ రాథోడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.